ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కలెక్షన్లు 51 కోట్లు దాటాయి

Sat, Apr 19, 2014
'దృశ్యం'  పోస్టర్
'దృశ్యం' పోస్టర్
ఇటీవలి కాలంలో దక్షిణాది సినీ రంగంలో సంచలనం సృష్టించిన సినిమా 'దృశ్యం'.

మోహన్ లాల్, మీనా జంటగా మలయాళంలో నాలుగున్నర కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ సినిమా క్లాస్, మాస్ ... అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకుంది.

సినిమాలో వున్న నవ్యత అందర్నీ అలా కట్టిపారేసింది.

అందుకే, 100 రోజుల ప్రదర్శన దాటినప్పటికీ ఇంకా ఇది ఆడుతూనే వుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు 51 కోట్లకు చేరాయట!

అంటే, మలయాళ సినిమా పరిశ్రమలో ఇది ఆల్ టైం రికార్డన్న మాట.

ఈ సినిమా వసూళ్లు చూసి దక్షిణాది ఇతర సినీ పరిశ్రమల వారు ముక్కు మీద వేలేసుకున్నారు.

ఇన్నాళ్లూ మలయాళ పరిశ్రమ మార్కెట్ చిన్నదని అంతా భావించారు.

ఈ సినిమా వసూళ్లతో దాని అసలైన స్టామినా తెలిసింది.

బాగా తీస్తే ఏ సినిమా అయినా ఇలాగే వసూలు చేస్తుందన్న విషయాన్ని 'దృశ్యం' నిరూపించింది!
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)