ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మూడు సినిమాలకు ఓకే చెప్పాడు

Tue, Apr 08, 2014
సునీల్
సునీల్
ఇటీవల తాను నటించిన 'భీమవరం బుల్లోడు' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, తాను హీరోగా కొనసాగడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు హాస్యకథానాయకుడు సునీల్.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన హీరోగా మూడు సినిమాలకు ఓకే చెప్పాడు.

వీటిలో ఒకటి విక్కీ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మించే సినిమా కాగా... మరొకటి రచయిత గోపీమోహన్ దర్శకత్వంలో రూపొందుతుంది.

ఇంకొకటి తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపొందే 'భక్త కన్నప్ప'.

ఇది మే నెలాఖరులో కానీ, జూన్ ప్రథమార్థంలో కానీ మొదలవుతుంది.

గతంలో వచ్చిన భక్త కన్నప్ప సినిమాలకు, దీనికీ ఏమాత్రం సంబంధం ఉండదని సునీల్ చెబుతున్నాడు. ఇదొక ట్రైబల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుందని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)