ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అతని కోసమే ఒప్పుకుందట!

Sat, Mar 22, 2014
దీపికా పదుకొనే
దీపికా పదుకొనే
మామూలుగా ఏ హీరోయిన్ అయినా ఒక సినిమా ఒప్పుకునే ముందు, అందులో హీరో ఎంతటి వాడైనా ... ఆ సినిమా కథ, అందులో తమ పాత్ర కచ్చితంగా తెలుసుకుంటారు.

అయితే, అందుకు భిన్నంగా దీపికా పదుకొనే ఇటీవల ఓ సినిమా చేసింది.

అదే ... 'కొచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహ')!

ఈ ప్రాజెక్టులో దీపికాను నటింపజేసేందుకు దర్శకురాలు, రజనీ చిన్న కుమార్తె ఐశ్వర్య కలసినప్పుడు వెంటనే ఓకే చెప్పేసిందట.

స్క్రిప్ట్ గురించి కానీ, తన పాత్ర గురించి కానీ ఎలాంటి వివరాలు అడగకుండానే ఆమె ఒప్పేసుకుందట.

రజనీకాంత్ లాంటి ఒక లెజెండ్ తో నటించే అవకాశం రావడం అన్నది తనకు లభించిన గౌరవంగా భావించి సంతోషపడ్డానని ఈ సొట్ట బుగ్గల సుందరి సెలవిచ్చిందట.

అంతేకాదు, తొలిసారిగా ఆయనతో తెరపై కనిపించబోతున్నందుకు తెగ ఎగ్జైట్ గా ఉందని తెలిపింది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)