ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెంకీ సినిమా నుంచి పవన్ డ్రాపా?

Sat, Mar 15, 2014
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇందులో వెంకటేష్, పవన్ కల్యాణ్ కలసి నటిస్తారంటూ నిర్మాతల నుంచి ప్రకటన కూడా వచ్చింది.

అయితే, ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ప్రవేశించడం ... దగ్గరలోనే ఎన్నికలు ఉండడంతో పవన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటాడంటూ ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల దృష్ట్యా ఆయన రాష్ట్రమంతటా పర్యటించాల్సి వున్నందున ఈ సినిమాలో నటించడం ఆయనకు సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.

అయితే, ఇందులో పవన్ చేస్తున్నది ప్రత్యేక పాత్రేననీ, మహా అయితే పది పదిహేను రోజులు పనిచేస్తే సరిపోతుందనీ, అందుకని ఈ సినిమా చేస్తాడనీ మరో కథనం వినిపిస్తోంది.

ఒకవేళ తప్పుకుంటే కనుక పవన్ పాత్రకు తమిళ హీరో విక్రంను తీసుకుంటారట!
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)