ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విమర్శకులకు పవన్ జవాబు?

Thu, Mar 13, 2014
పవన్  కల్యాణ్
పవన్ కల్యాణ్
రేపు జరగబోయే మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతాడు?

ఇప్పుడు అందరిలోనూ ఇదే క్యూరియాజిటీ!

తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానన్న విషయంపై ఆయన కచ్చితంగా మాట్లాడతాడు.

ఇది అందరికీ తెలిసిందే... అయితే, తన వ్యక్తిగత విషయాలపై కూడా ఆయన మాట్లాడతాడని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఎందుకంటే, ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడంపై ఇప్పటికే పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇక పెద్దగా చర్చ లేకుండా చేయడం కోసం ... ఈ విషయంలో మహిళల్లో వున్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం మీడియా అడగకుండా, తనే వీటిపై వివరణ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

తాను మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై తొలిసారిగా పవన్ గళం విప్పుతాడని పరిశీలకులు కూడా ఊహిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)