ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిర్మాతలకు పవన్ టెన్షన్!

Tue, Mar 11, 2014
పవన్
పవన్
టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరూ ఇప్పుడు మార్చ్ 14 మీద దృష్టి పెట్టారు.

తన రాజకీయ ప్రవేశంపై పవన్ కల్యాణ్ ఆ రోజు మీడియా సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటుండడంతో ఆ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రస్తుత రాజకీయాల గురించి, తన అన్న చిరంజీవి గురించీ పవన్ ఏం మాట్లాడతాడా? అని అంతా ఆసక్తిగా, ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

ఒకవిధంగా చెప్పాలంటే, రాష్ట్రం యావత్తూ కూడా పవన్ ప్రసంగం కోసం వెయిట్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగే సినిమా వేడుకలు కూడా వాయిదా వేసుకున్నారు.

అలాగే, ఆ రోజు విడుదల కావాల్సిన చిన్న సినిమాలు కూడా కొన్ని వున్నాయి.

దాంతో, ఆయా చిత్ర నిర్మాతలు టెన్షన్ తో వున్నట్టు చెబుతున్నారు. ఆ రోజు మ్యాటినీ షో, తొలి ఆటలకు నీళ్ళొదులుకోవలసిందేనని వీరు మథనపడుతున్నారు.

'పవన్ మీడియా సమావేశం లైవ్ టెలికేస్ట్ అవుతున్నప్పుడు, ఇక మా సినిమాలు చూడడానికి ఎవరొస్తారు?' అంటూ నిర్మాతలు వాపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)