ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ తో గౌతమి జోడీ

Sat, Mar 08, 2014
గౌతమి,  కమల్
గౌతమి, కమల్
తెరవెనుక జంటగా సహజీవనం సాగిస్తున్న కమలహాసన్, గౌతమి తెరమీదకు కూడా మళ్లీ జంటగా రానున్నారు.

గతంలో 'కురుదిపుణల్', 'దేవర్ మగన్' వంటి చిత్రాలలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ జంట మళ్లీ త్వరలో ప్రేక్షకులను రంజింపజేయడానికి సిద్ధమవుతున్నారు.

మలయాళంలో సూపర్ హిట్టయిన 'దృశ్యం' చిత్రాన్ని కమల్ హీరోగా తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇందులో కథానాయికగా ఇప్పటి వరకు పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా గౌతమి పేరు కూడా వచ్చింది.

గౌతమితోనే ఈ చిత్రం చేయాలని కమల్ నిర్ణయానికి వచ్చాడట.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ఉత్తమ విలన్' సినిమా తర్వాత ఈ 'దృశ్యం' సెట్స్ కి వెళుతుంది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)