ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కవలల తల్లిగా ఐశ్వర్య?

Fri, Mar 07, 2014
ఐశ్వర్యా రాయ్
ఐశ్వర్యా రాయ్
అందాల ఐశ్వర్యా రాయ్ ని తెరపై గర్భవతిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.

పైగా, మామూలు గర్భం కూడా కాదు ... కవలల్ని మోస్తున్న గర్భవతిగా ఆమె కనిపించాలి.

ఐష్ ని ఇలా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్న దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్!

శ్యాం బెనగళ్ వద్ద పనిచేసిన ప్రహ్లాద్ ఈ కథను త్వరలో ఐశ్వర్యకు చెప్పనున్నాడు.

21 ఏళ్ల ఓ అమ్మాయికి 29 ఏళ్లు వచ్చే వరకు మధ్యలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ కథను ఆయన రూపొందించుకున్నాడు.

"ఐష్ 21 ఏళ్ల అమ్మాయిగా కనిపించాలంటే కచ్చితంగా ఆమె చాలా బరువు తగ్గాలి. అది ఆమె చేతిలో పనే!
అయితే, వున్న సమస్యల్లా ఈ సినిమా షూటింగు రెండు నెలల పాటు దక్షిణాఫ్రికాలో చేయాలి.
మరి, కూతుర్ని వదిలి ఐష్ అన్నాళ్లు అక్కడ ఉండగలదా?
అలాగే, కవలల్ని మోసే గర్భవతిగా ఆమె కనిపించాలి. మరో వారం రోజుల్లో ఐష్ కి కథ చెబుతున్నాను. అన్నీ కుదిరితే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తాను" అంటున్నాడు ప్రహ్లాద్.

ఇందులో హీరోగా ఆమె భర్త అభిషేక్ ని నటింపజేయాలన్నది కూడా దర్శకుడి కోరిక. కాబట్టి, ఈ జంట ఈ సినిమాకు ఒప్పుకోవచ్చనే అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)