ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కగా చేస్తానంటున్న మనీషా!

Sat, Feb 22, 2014
మనీషా కోయిరాలా
మనీషా కోయిరాలా
మనీషా కొయిరాల మనసు అక్క పాత్రలపైకి మళ్లింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ యువ నటుడు రణ్ బీర్ కపూర్ ప్రతిభకు ఆమె ముగ్ధురాలై, అతనికి అక్కగా నటించాలని ఉందని మనసులో మాటను వెల్లడించింది.

దానిపై మనీషా మాట్లాడుతూ, రణబీర్ చూడటానికి చాలా తెలివైన వ్యక్తిగా కనిపిస్తాడని, తనకు సోదరుడి పాత్రలో అతను చేయగలడని, సరిపోతాడని అంటోంది.
బాలీవుడ్ లో ఒకప్పుడు వరుస చిత్రాలు చేసి, విజయవంతమైన కథానాయికగా మనీషా పేరుపొందిన సంగతి తెలిసిందే. అనంతరం తన హవా క్షీణించడంతో నలభై ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది.
ఆ తర్వాత భర్త నుంచి విడిపోయింది. అదే సమయంలో ఏడాదిన్నర కిందట ఒవేరియన్ క్యాన్సర్ కు గురయిన మనీషా అమెరికాలో చికిత్స పొంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)