ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్, కృష్ణవంశీ సినిమా షురూ!

Thu, Feb 06, 2014
క్లాప్ ఇస్తున్న చరణ్
క్లాప్ ఇస్తున్న చరణ్
రామ్ చరణ్, కృష్ణవంశీ సినిమా మొదలైంది!

ఈ రోజు ఉదయం హైదరాబాదు ఫిలిం నగర్లోని దైవ సన్నిధానం సముదాయంలో ఈ సినిమా షూటింగును లాంచనంగా ప్రారంభించారు.

దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలిషాట్ కు రామ్ చరణ్ క్లాప్ ఇచ్చాడు. దీనికి పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, సత్య రంగయ్య గౌరవ దర్శకత్వం వహించారు.



తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని కృష్ణవంశీ రూపొందిస్తున్నారని నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందని ఆయన అన్నారు.
రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లో వచ్చిన 'మగధీర', 'నాయక్', 'ఎవడు' సూపర్ హిట్స్ అయ్యాయనీ, ఇది కూడా అదే రీతిలో పెద్ద హిట్టవుతుందనీ నిర్మాత అన్నారు.
ఇప్పుడు మూడు రోజుల పాటు హైదరాబాదులో షూటింగ్ జరుగుతుందనీ, అనంతరం రామేశ్వరం, పొల్లాచ్చి, నాగర్ కోయిల్ ప్రాంతాలలో 40 రోజుల షూటింగ్ చేస్తామని తెలిపారు.



తమిళ నటుడు రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ మరో జంటగా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)