ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేష్ తో యూటీవీ సినిమా లేదా?

Tue, Feb 04, 2014
మహేష్ బాబు
మహేష్ బాబు
మహేష్ బాబుతో బాలీవుడ్ కి చెందిన యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఆమధ్య ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడని కూడా వార్తలు వచ్చాయి.
అయితే, ప్రస్తుతం యూటీవీ సంస్థ ఈ ప్రాజక్టును డ్రాప్ చేసుకునే ఆలోచనలో వున్నట్టు సమాచారం.

ఇటీవల విడుదలైన మహేష్ సినిమా '1' బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించకపోవడంతో, యూటీవీ పునరాలోచనలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.
దానికి తగ్గట్టు కొరటాల శివతో చేయడానికి మహేష్ సంశయిస్తుండడం కూడా దీనికి ఓ కారణంగా చెబుతున్నారు.
ఏమైనా, త్వరలో ఈ ప్రాజక్టుకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుంది!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)