ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కన్నడలోకి వర్మ పుస్తకాలు

Mon, Jan 27, 2014
వర్మ
వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆమధ్య తెలుగులో వచ్చిన 'వోడ్కా విత్ వర్మ' పుస్తకం కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.
ప్రముఖ రచయిత, గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పుస్తకం అమ్మకాలలో కూడా ఓ సంచలనం అయింది.
ఇప్పుడీ పుస్తకానికి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని, కన్నడ భాషలోకి దీనిని అనువదిస్తున్నారు.
ప్రముఖ అనువాద రచయిత, కార్టూనిస్ట్ సృజన్ ఈ అనువాద రచన చేస్తున్నారు.
విశేషం ఏమిటంటే, అదే పేరుతో అంటే 'వోడ్కా విత్ వర్మ' పేరిట కన్నడ అనువాదం జరుగుతోంది.
అలాగే, వర్మ రాసిన 'నా ఇష్టం' పుస్తకాన్ని 'నన్నిష్ట' పేరుతో అనువదిస్తున్నారు. త్వరలో ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ బెంగళూరులో జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)