ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కడ సుదీప్ 'చూయింగ్ గమ్'!

Mon, Jan 27, 2014
సుదీప్
సుదీప్
'ఈగ' చిత్రంతో లెక్కలేనంత ప్రజాదరణ పొందిన నటుడు సుదీప్. ఈ చిత్రంతో ఆయన ఫేమ్ విదేశాలకు పాకింది. ఇదిలావుంటే జపాన్ ప్రజలు సినిమావాళ్లపై తెగ అభిమానం చూపుతారు. ప్రస్తుతం వారి అభిమానానికి సుదీప్ కూడా పాత్రుడయ్యాడు. అదెలా! అనుకుంటున్నారా.. రాజమౌళి రూపొందించిన ఈగ అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. అందులో భాగంగా జపాన్ లోనూ విడుదలైంది. అందులో సుదీప్ నటనకు దాసోహమైన అక్కడివారు అప్పుడే అభిమానులయ్యారు. ఓ చూయింగ్ గమ్ ఉత్పత్తిదారుడైతే ఏకంగా అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు గమ్ కవరుపై సుదీప్ ఫొటోని ముద్రించాడు. దాంతో, ఆ చూయింగ్ గమ్ లకు డిమాండు పెరిగిపోయింది.

ఈ విషయం ఇటీవలే సుదీప్ కు తెలిసింది. ఓ చిత్రం షూటింగు కోసం ఇటీవల సుదీప్ బ్యాంకాక్ వెళ్లాడు. ఆ సమయంలో వాటిని చూసిన అతను అసలు విషయాన్ని ఆరా తీశాడు. దాంతో, దేశం కాని దేశంలో తనకంతటి గుర్తింపు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాడు. జపాన్ అభిమానులు తనను ఆరాధించడం అదృష్టమని పొంగిపోతున్నాడు. అంతేకాదు వారికి కృతజ్ఞతలు కూడా తెలిపాడు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)