ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు!

Tue, Jan 21, 2014
నాటి కార్యక్రమంలో చిరు, సుహాసిని
నాటి కార్యక్రమంలో చిరు, సుహాసిని
రజనీకాంత్ ... చిరంజీవి ... మోహన్ లాల్ ... బాలకృష్ణ ... వెంకటేష్ ... సుహాసిని ... రాధ ... రాధిక ... నదియ .. వావ్... అదొక తారాతోరణం!

1980ల నాటి దక్షిణాది హీరోలు, హీరోయిన్లు అంతా చేరి అల్లరల్లరి చేశారు!

ఈ ముచ్చట ఇటీవలే చెన్నయ్ బీచ్ రోడ్ లోని మోహన్ లాల్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకుంది.



మొత్తం 32 మంది తారలు ఒకేచోట చేరి ఆనాటి మధుర జ్ఞాపకాలను ... నేటి వ్యాపకాలను ముచ్చటించుకున్నారు. 2009 నుంచీ '80 క్లబ్' పేరిట ప్రతి ఏడాది జరుగుతున్న ఈ తారల సమ్మేళనానికి సుహాసిని సంధానకర్తగా వ్యవహరిస్తోంది.

ఈ కార్యక్రమానికి ఆయా తారలు ఒంటరిగానే రావాలన్నది ఒక నియమమట. కనీసం జీవిత భాగస్వామి కూడా రాకూడదు! ఈ రూల్ రజనీకాంత్ ప్రపోజ్ చేశారనీ, అంతా దీనిని కచ్చితంగా పాటిస్తున్నామనీ సుహాసిని చెబుతోంది. ఈ ఏడాది మిస్సయిన కమలహాసన్, నాగార్జున వచ్చే ఏడాది తప్పకుండా విచ్చేస్తామని చెప్పారట!
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)