ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లరి నరేష్ తో హీరో కూతురు!

Sat, Jan 18, 2014
వరలక్ష్మి
వరలక్ష్మి
హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రంలో ఓ సీనియర్ హీరో కుమార్తెతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఆమె మరెవరో కాదు... హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. ఈ విషయాన్ని స్వయంగా నరేషే వెల్లడించాడు. 'అవును, నేను నటించబోయే ఓ చిత్రం కోసం ఆమెను ఎంపిక చేశాం. ఇప్పటికే కొంత అడ్వాన్సు కూడా ఇచ్చాం. మా ఇద్దరి కాంబినేషన్ లో చిత్రం మార్చి లేదా ఏప్రిల్లో మొదలవుతుంది' అని నరేష్ వివరించాడు.



ఇదిలావుంటే, నిర్మాత అనీల్ సుంకర దర్శకుడిగా మారి నరేష్ తో గతేడాది 'యాక్షన్ 3డి' చిత్రాన్ని రూపొందించిన విషయం మనకు తెలుసు. ఈ చిత్రం ఘోరంగా పరాజయమైనా మరోసారి వీరిద్దరూ జత కడుతున్నారు. ఈసారి మాత్రం అనీల్ నిర్మాతగానే వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)