ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రేయ్' మీద ఆశలు పెట్టుకుంది

Fri, Jan 03, 2014
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్
తెలుగులో మొన్నటి వరకు ఒకటీ అరా సినిమాలు చేసిన శ్రద్ధా దాస్, ఇప్పుడు చేతిలో కొత్త సినిమాలు లేకపోయినా మనిషి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా వుంది. త్వరలో మళ్లీ
దూసుకువస్తానని చెబుతోంది. అంత గట్టి నమ్మకం ఎలా వచ్చింది అమ్మడూ?
అనడిగితే, 'అదంతా రేయ్ సినిమా మహిమ' అంటోంది. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో
చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా
దాస్ కథానాయికగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే!

"తెలుగులో
ఆఫర్లు వస్తూనే వున్నాయి. అయితే, నేనే ఒప్పుకోవడం లేదు. 'రేయ్' సినిమా
విడుదల వరకు ఎదురుచూస్తున్నాను. ఆ సినిమా మీద నాకు పూర్తి నమ్మకం వుంది. ఇది నాకు కొత్త ఇమేజ్ని ఇస్తుంది. ఆ సినిమాతో
కచ్చితంగా నా దశ మారిపోతుంది. అందుకే, కొత్త సినిమాలు ఒప్పుకోకుండా వెయిట్
చేస్తున్నాను" అంటోంది ఈ బెంగాలీ భామ. అయితే, ఇతర భాషల్లో మాత్రం
చేస్తున్నానని చెప్పింది.    
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)