ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతాకు '1' కథానాయిక ఆన్సర్

Wed, Jan 01, 2014
కృతి సనాన్
కృతి సనాన్
ఇటీవల '1'
సినిమా పోస్టర్ పై సమంతా చేసిన కామెంట్ పెద్ద వివాదం రేపిన సంగతి
తెలిసిందే. ఆ పోస్టర్ మహిళలను కించపరిచేదిగా వుందంటూ సమంతా చేసిన కామెంట్
పై మహేష్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీనిపై మహేష్ రెండు రోజుల క్రితం
స్పందించాడు కూడా. ఆ పోస్టర్ ద్వారా ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదనీ,
ఒకవేళ దాని వల్ల  ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే సారీ చెబుతాననీ హుందాగా
చెప్పాడు.

ఈ నేపథ్యంలో ఆ సినిమా కథానాయిక కృతి సనాన్ కూడా తాజాగా
స్పందించింది. "ఆ పోస్టర్లో తప్పేమీ లేదు. అది ఒక పాటలో భాగమే. సినిమా
చూశాక ఇది అందరికీ అర్థమవుతుంది. అయినా, మహిళలను కించపరిచే సన్నివేశాలుంటే
నేనెందుకు చేస్తాను?" అంటూ సమంతా కామెంటుకు సమాధానం ఇచ్చింది కృతి.  
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)