ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రి సినిమాలో చేస్తుందట!

Tue, Dec 31, 2013
అలియా భట్
అలియా భట్
కథానాయికలకు
ఒక్కొక్కరికి ఒక్కో కోరిక వుంటుంది. బాలీవుడ్ కథానాయిక అలియా భట్ కి కూడా
అలాగే ఓ కోరిక వుంది. అదేమిటంటే, తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో ఒక్క
సినిమాలోనైనా నటించాలన్నది! "అవును ... నాన్న దర్శకత్వంలో నటించాలనుంది.
ఆయనంటే నాకు భయం లేదు. ఆయనకున్న నాలెడ్జ్ అంటేనే నాకు భయం. అయితే, నాన్న
సినిమాలో నటించే అవకాశం నాకు రాదేమో. ఎందుకంటే, ఇప్పటికే ఆయన
దర్శకత్వానికి దూరంగా వున్నారు కదా?" అంటోంది అలియా.

ఇరవై ఏళ్ల ఈ ముద్దుగుమ్మ గత సంవత్సరం (2012) 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే, చేతిలో నాలుగు సినిమాలు మాత్రం వున్నాయి! 

 
 



X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)