ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శర్వా, నిత్యా మళ్లీ మళ్లీ!

Mon, Dec 30, 2013
శర్వానంద్, నిత్యా మీనన్
శర్వానంద్, నిత్యా మీనన్
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు!
'రాక్షసుడు' సినిమాలో చిరంజీవి, సుహాసినీ పాడుకునే ఈ పాట ఆల్ టైం హిట్ గా నిలిచింది!
ఇప్పుడీ పల్లవే ఓ సినిమాకు టైటిల్ అవుతోంది. శర్వానంద్ నటించే కొత్త చిత్రానికి ఈ టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం.

'ఓనమాలు'
ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. వచ్చే నెలలో
షూటింగును ప్రారంభించుకునే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు
ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికే 'ఏమిటో ఈ మాయ' సినిమాలో శర్వానంద్ సరసన
కథానాయికగా నటిస్తున్న నిత్యా మీనన్ ఇందులో కూడా కథానాయికగా నటిస్తోందట.
ఇంకో విశేషం ఏమిటంటే, 'రాక్షసుడు' చిత్రాన్ని నిర్మించిన కెయస్ రామారావే ఇప్పుడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు!    
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)