ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేష్ సినిమాలో నదియా!

Mon, Dec 23, 2013
నదియా
నదియా
నలభై ఐదు
దాటినా కూడా ఇంకా అందంగానే కనిపిస్తున్న నిన్నటితరం కథానాయిక నదియా తన
సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి సినిమాలే పడుతోంది. ఇటీవల వచ్చిన 'మిర్చి',
'అత్తారింటికి దారేది' సినిమాలలో ఆమె పోషించిన పాత్రలకు మంచి పేరు రావడంతో
అమ్మ, వదిన, అత్త పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారింది.

తనకు పాత్ర నచ్చితేనే చేస్తానంటున్న ఈ మలయాళ భామ, తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న
'ఆగడు' సినిమాకు ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ
కీలకమైన పాత్రకు దర్శకుడు శ్రీను వైట్ల ఈమెను ఎంపిక చేసినట్టు
చెబుతున్నారు. ఇంకా పలు సినిమాలలో ఆఫర్లు వస్తున్నప్పటికీ, స్టార్ హీరోయిన్
రేంజిలో 50 లక్షల పారితోషికం ఈమె డిమాండు చేస్తుండడం వల్ల  చిన్న
నిర్మాతలు ఆమె దరిదాపుల్లోకి రావడం లేదు!
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)