ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఎవడు'కి మరో కొత్త పాట!

Sun, Dec 22, 2013
సినిమాలో ఎంతటి సత్తా ఉన్నప్పటికీ, దానికి ప్రమోషన్ అనేది ఈవేళ కంపల్సరీ అయిపోయింది. అందులోనూ విడుదల సమయంలో ఇతర సినిమాల నుంచి పోటీ వుంటే కనుక ఈ
ప్రమోషన్ మరీ భారీగా చేసుకోవాలి. సంక్రాంతికి ఓపక్క మహేష్ బాబు సినిమా '1'
నుంచి పెద్ద పోటీ ఎదురవుతుండడంతో, రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా
విషయంలో ఆ చిత్ర నిర్మాత ఈ ప్రమోషన్ విషయంలో పెద్ద ప్లానే వేస్తున్నాడు.

ప్రత్యేకంగా
ఓ ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని రామ్
చరణ్, అల్లు అర్జున్ పై తమాషాగా చిత్రీకరిస్తారట. ఇందుకోసం సంగీత దర్శకుడు
దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే బాణీలు కట్టే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ 'ఎవడు'
సినిమాలోని పాటలు కొన్ని నెలల క్రితమే విడుదలైపోవడంతో, ఇప్పుడు
రూపొందించే కొత్త సాంగ్ సినిమాకి ఫ్రెష్ నెస్ తెస్తుందని భావిస్తున్నారు.  
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)