ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగుకి దూరం కాదట!

Sat, Dec 21, 2013
కాజల్
కాజల్
తెలుగు ప్రేక్షకుల
ఆదరాభిమానాల వల్లే తానీ స్థాయిలో వున్నానని అంటోంది కాజల్ అగర్వాల్.
'ఉమెన్స్ షాపింగ్ వరల్డ్' షోరూం ప్రారంభించడానికి ఈ అందాలతార తూర్పు
గోదావరి జిల్లా కాకినాడ పట్టణానికి విచ్చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
"తెలుగు సినిమాలకు నేనేమీ దూరం కాలేదు. మంచి అవకాశాలు వస్తే చేస్తూనే
వున్నాను. అసలు తెలుగు సినిమాల వల్లే కథానాయికగా నేను మంచి స్థానాన్ని
పొందగలిగాను" అని చెప్పింది.

ప్రస్తుతం తెలుగులో కొన్ని ప్రాజక్టులు
చర్చల దశలో వున్నాయని చెప్పింది. ఎటు చూసినా పచ్చని పంట చేలతో ఆహ్లాదకరంగా
కనిపించే తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే తొలిసారని చెప్పింది.
అభిమానులు చూపుతున్న ఆదరణ మరువలేనిదని కూడా చెప్పింది. పొతే, ఈ షాపింగ్
సెంటర్ ప్రారంభానికి హాజరుకావడానికి ఈ ముద్దుగుమ్మ పాతిక లక్షలు
తీసుకున్నట్టు సమాచారం.   
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)