ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అత్తారింటికి' ఆయనకు నచ్చలేదట!

Sat, Dec 21, 2013
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్
దక్షిణాది
సినిమాలను రీమేక్ చేసుకుంటూ, విజయాలు పొందే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్
తాజాగా ఓ తెలుగు సూపర్ హిట్ చిత్రాన్ని చేయడానికి ఆసక్తి చూపనట్టు ప్రచారం
జరుగుతోంది. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో
వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమా సూపర్ హిట్టవడమే కాకుండా, తెలుగులో
ఆల్ టైం రికార్డు నెలకొల్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని సల్మాన్
హీరోగా హిందీలో రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నించారు. అయితే,
సినిమా చూసిన ఆ హీరోగారు మాత్రం 'ప్చ్...' అంటూ లైట్ తీసుకున్నాడట. ఈ కథ
బాలీవుడ్ కి సూట్ కాదనీ, తనకు అసలే సరిపడదనీ తిరస్కరించినట్టు టాలీవుడ్ లో
ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంచితే, మరోపక్క ఈ చిత్రాన్ని విజయ్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారు.   
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)