ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Dec 21, 2013
కాజల్
కాజల్
*  చెల్లి పెళ్లి
కోసమే షూటింగుల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నానని చెబుతోంది అందాలభామ
కాజల్. ప్రస్తుతం పెళ్ళిపనులతో తమ ఇల్లంతా సందడిగా ఉందనీ, పనులన్నీ తనే
స్వయంగా చూసుకుంటున్నాననీ ఈ ముద్దుగుమ్మ చెప్పింది. కాజల్ చెల్లి నిషా ఈ
నెల 28న మనువాడుతున్న సంగతి మనకు తెలిసిందే! 

కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించే చిత్రం పూజా కార్యక్రమాలు
త్వరలో ప్రారంభమవుతాయి. రెగ్యులర్ షూటింగును జనవరి నుంచి నిర్వహిస్తారు.
ఇది పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమాలా ఉంటుందని సినిమా యూనిట్
చెబుతోంది.
*  నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజయిన 'ధూమ్ 3'
చిత్రానికి మంచి స్పందన వస్తోంది. కాగా, టాలీవుడ్ కి చెందిన నందమూరి
బాలకృష్ణ, మోహన్ బాబు, విష్ణు, రాజమౌళి తదితరుల కోసం హైదరాబాదు ప్రసాద్
ల్యాబ్స్ లో ప్రత్యేక షో వేశారు. సినిమా తనకు బాగా నచ్చిందని రాజమౌళి చెప్పాడు.

'రామానుజన్' పేరిట గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవిత కథ వెండితెరకు
ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతున్న ఈ
చిత్రానికి జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామానుజన్ గా అభినయ్
నటించగా, అతని తల్లిగా సుహాసిని నటించింది. త్వరలో చిత్రాన్ని రిలీజ్
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.   
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)