ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Sat, Dec 07, 2013
పూర్ణ
పూర్ణ
*  గతంలో 'సీమటపాకాయ్'
సినిమాలో అల్లరి నరేష్ సరసన నటించిన పూర్ణ మళ్ళీ ఇప్పుడు అతని పక్కన 'లడ్డూ
బాబు' సినిమాలో నటిస్తోంది. రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం
షూటింగు హైదరాబాదులో జరుగుతోంది.
*  కిషోర్ తిరుమల దర్శకత్వంలో
రూపొందిన 'సెకండ్ హ్యాండ్' చిత్రం విడుదలకు రెడీ అయింది. రచయిత బీవీయస్ రవి
సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు.
*  అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రేసుగుర్రం' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ రోజు చిత్ర దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా దీనిని రిలీజ్ చేశారు. ఇందులో శృతి హాసన్, సలోనీ కథానాయికలుగా నటిస్తున్నారు. 


X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)