ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కూడా కన్ఫర్మ్ చేశాడు

Fri, Dec 06, 2013
రామ్ చరణ్
రామ్ చరణ్
ఆఖరికి రామ్ చరణ్ తన
'ఎవడు' సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశాడు. సంక్రాంతికి ఈ సినిమా
విడుదల అవుతుందని అభిమానులకి తీయటి వార్త చెప్పాడు. తన అఫీషియల్ ఫేస్ బుక్
అకౌంటు ద్వారా చరణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. "ఇక ఎదురుచూపులు అక్కర్లేదు
... ఎవడు సినిమాని జనవరి 12న విడుదల చేస్తూ సంక్రాంతి పండుగను కాస్త
ముందుగానే తెస్తున్నాం. పెద్దపండుగను ఇలా సెలెబ్రేట్ చేసుకుందాం" అంటూ చరణ్
పోస్ట్ చేశాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసిన విషయం మనకు తెలిసిందే.
రకరకాల కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. చివరికి సంక్రాంతికి వెలుగు
చూస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్,
ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. 
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)