ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ రజనీ సినిమా వాయిదా?

Sat, Nov 30, 2013
'కొచ్చాడియాన్' గా రజనీ
'కొచ్చాడియాన్' గా రజనీ
రజనీకాంత్
నటించిన 'కొచ్చాడియాన్' సినిమా ప్రేక్షకులతో దోబూచులాట ఆడుతోంది, 'ఇదిగో
... అదిగో' అంటూ తేదీలు ప్రకటిస్తున్నా, విడుదల మాత్రం వాయిదాల మీద
వాయిదాలు పడుతూపోతోంది. డిసెంబర్ 12న రజనీ జన్మదినం రోజున రిలీజ్ చేస్తామని
ఆమధ్య ప్రకటించారు. తర్వాత దానిని సంక్రాంతికి అన్నారు. ఇప్పుడు మళ్లీ అది
కూడా లేదంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది నాడు విడుదల
అవుతుందని తాజా సమాచారం.

అసలీ సినిమా ఎప్పుడు రిలీజవుతుందన్న
విషయంలో ఈ సినిమా ఎగ్జిబిటర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్లకి కూడా
సరైన సమాచారం లేదు. "సంక్రాంతికి విజయ్, అజిత్ ల సినిమాలు రిలీజవుతున్నాయి.
అంటే, రజనీ సార్ సినిమా లేదనే అర్థం. మాకు అనధికారికంగా తెలిసిన
సమాచారాన్ని బట్టి తమిళ సంవత్సరాదికి చిత్రాన్ని రిలీజ్ చేస్తారు"
అంటున్నాడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఓ ఎగ్జిబిటర్. మరి, రజనీ
అభిమానులకు ఈ విషయంలో శుభవార్త ఎప్పుడు చేరుతుందో!


X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)