ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమ్ముడిని ప్రమోట్ చేస్తున్న అన్న

Tue, Nov 19, 2013
కార్తీ, సూర్యా
కార్తీ, సూర్యా
స్టార్
హీరో లాంటి అన్నగారు వుంటే ఎంతటి ప్రయోజనమో తమిళ హీరో కార్తీ ఇప్పుడు
అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే, తనకు వస్తున్న ఆఫర్లను హీరో
సూర్యా మెల్లిగా తన తమ్ముడు కార్తీకి మళ్లిస్తున్నాడట. ఈ స్కీమ్ ని సూర్యా
చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నాడు. ఎవరైనా దర్శకుడు మంచి కథతో తన వద్దకు
వస్తే, 'ముందుగా తమ్ముడితో చేయండి, మనం తర్వాత చేద్దాం' అంటూ కార్తీ
వద్దకు పంపుతున్నాడట.

ప్రస్తుతం కార్తీ చేస్తున్న 'బిర్యానీ'
చిత్రం అలా అన్నగారు పంపినదే. ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు ఆమధ్య సూర్యా
కోసం ఈ 'బిర్యానీ' కథను సిద్ధం చేశాడట. అయితే, సూర్యా అలా చెప్పడంతో, ఇక
తప్పక కార్తీతో చేశాడు. ఆ తర్వాతైనా తనకు అవకాశం ఇవ్వకపోతాడా? అన్నది ఈ
దర్శకుడి ఆశ. ఇదే కోవలో ఇటీవల దర్శకులు రాజేష్, హరి కూడా కథలు చెప్పగా,
ముందుగా తమ్ముడితో చేయమని చెప్పాడట. మరి, సూర్యా అమలు చేస్తున్న ఈ స్కీమ్
ఎన్నాళ్ళు కొనసాగుతుందో! 
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)