ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ మల్టీస్టారర్లో రజనీకాంత్?

Fri, Nov 15, 2013
రజనీకాంత్
రజనీకాంత్
తమిళ
సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో హిందీలో కూడా పలు సినిమాలలో నటించాడు.
అప్పట్లోనే అక్కడ మల్టీ స్టారర్స్ లో రజనీ నటించాడు. అయితే, తమిళంలో సూపర్
స్టార్ ఇమేజ్ వచ్చాక, ఇక బాలీవుడ్ కి బై చెప్పేశాడు. అలాంటి రజనీ త్వరలో ఓ
హిందీ సినిమాలో నటించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. పైగా, తన అల్లుడు
ధనుష్ తో కలిసి రజనీ ఈ సినిమా చేస్తున్నాడట!

తమిళంలో ఓ రేంజ్ హీరోగా
రాణిస్తున్న ధనుష్ ఇటీవల హిందీలోకి కూడా ఎంటరై 'రాంజానా' అనే చిత్రంలో
నటించాడు. ఇది సూపర్ హిట్టయింది. దాంతో, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన
ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పుడు మరో భారీ ప్రాజక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో
రజనీకాంత్, ధనుష్ లను నటింపజేయాలన్నది అతని ప్రయత్నం. రజనీని ఒప్పించే
బాధ్యతను ధనుష్ చేతుల్లోనే పెట్టాడట. మరి, అల్లుడుగారు అడిగితే, మామగారు
కాదంటారా... చూద్దాం!
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)