ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూపర్ స్టార్ సంక్రాంతికి వస్తాడు

Fri, Nov 15, 2013
రజనీకాంత్
రజనీకాంత్
'రోబో'
సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రజనీకాంత్ నటించిన తదుపరి
చిత్రం 'కొచ్చాడియాన్' విడుదల మొదటి నుంచీ వాయిదాల బాట పట్టింది. రజనీ
జన్మదినం సందర్భంగా డిసెంబర్ 12న రిలీజ్ చేసేస్తామని ఆమధ్య అట్టహాసంగా
ప్రకటించారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఇది వాయిదాపడింది. డిసెంబర్ 12న ఆడియోను రిలీజ్ చేసి, సంక్రాంతి సందర్భంగా జనవరి 10న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కొత్త డేట్ ఇచ్చారు.

హాలీవుడ్
సినిమా 'అవతార్'కు ఉపయోగించిన మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీని దీనికి
ఉపయోగించారు. దాంతో గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అయిందట. అందుకని సినిమా
వాయిదాలు పడుతూ వచ్చిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రజనీ కూతురు
సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా
నటించింది. తెలుగులో 'విక్రమసింహా' పేరిట దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ
సినిమా భారత సినీ చరిత్రలోనే వసూళ్ళ పరంగా పెద్ద రికార్డు సృష్టిస్తుందని
అంచనా వేస్తున్నారు. 
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)