ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుహాసినిలో నాయనమ్మ!

Thu, Oct 17, 2013
'రామానుజన్' సినిమాలో సుహాసిని
'రామానుజన్' సినిమాలో సుహాసిని
ప్రముఖ నటి
సుహాసిని ఇప్పుడు వాళ్ళ నాయనమ్మని అనుకరిస్తోంది. అప్పట్లో ఆవిడ కట్టూ
బొట్టూ, మాట తీరు ఎలా ఉండేవో సరిగ్గ అలాగే తనూ ఉంటోంది. అయితే, ఈ తతంగమంతా
'రామానుజన్' అనే తమిళ సినిమా కోసం జరుగుతోంది. గణిత మేధావి శ్రీనివాస
రామానుజన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'రామానుజన్' సినిమాలో అతని తల్లి
కోమలత్తమ్మాళ్ పాత్రను సుహాసిని పోషిస్తోంది. ఈ పాత్ర పోషణలో తన నాయనమ్మను
మోడల్ గా తీసుకుందట.

దాని గురించి సుహాసిని వివరిస్తూ, "ఈ
చిత్ర దర్శకుడు జ్ఞాన శేఖరన్ వచ్చి రామానుజన్ తల్లి పాత్ర నన్ను పోషించమని
అడగగానే ఎంతో థ్రిల్ ఫీలయ్యాను. ఒక అదృష్టంగా భావించాను. ఈ క్రమంలో మా
నాయనమ్మ గుర్తొచ్చింది. ఆమె కూడా అచ్చం రామానుజన్ తల్లిలానే డామినేటింగ్ గా
వుండేది. బాబాయ్ కమలహాసన్ ని తీర్చిదిద్దిన ఘనత ఆమెదే. నేను కూడా ఆమె
దగ్గరే పెరిగాను. అందుకే ఈ పాత్రకు మా నాయనమ్మను అనుకరించాను.

ఇక
సినిమాలో ధరించడం కోసం మా బంధువుల నుంచి, స్నేహితుల నుంచి తొమ్మిది గజాల
చీరలు సేకరించాను. మా అమ్మ ఫోటోల ఆధారంగా అప్పటి నగలను ఎంపిక చేసుకున్నాను.
కేశాలంకరణ కూడా అప్పట్లో వారు చేసుకునేలానే చేసుకున్నాను. మామూలుగా నాకు
చీరలు కట్టుకోవడం వచ్చు కానీ, మడికట్టు తెలియదు. ఈ సినిమా కోసం అది కూడా
నేర్చుకున్నాను. ఈ సినిమా పుణ్యమా అని, మొత్తం మీద మా నాయనమ్మను
అనుకరించేశాను" అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో సావిత్రి, జెమినీ గణేషన్ ల
మనవడు అభినయ్ టైటిల్ పాత్ర పోషించాడు.     
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)