ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాళ్లాయనతోనే నటిస్తుందట!

Sat, Oct 12, 2013
ఐశ్వర్యా రాయ్, అభిషేక్
ఐశ్వర్యా రాయ్, అభిషేక్
ఐశ్వర్యా రాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను త్వరలో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇకపై భర్తతో కలిసి మాత్రమే తను నటిస్తుందా? అనే సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. తాజాగా ఐశ్వర్య చేసిన ప్రకటన కూడా దీనికి ఊతమిస్తున్నట్టుగా వుంది. తాను, తన భర్త అభిషేక్ కలిసి త్వరలో రెండు సినిమాలలో జంటగా నటిస్తున్నామని ఐశ్వర్య తెలిపింది.

చాలా
మంది దర్శకులు తమను సంప్రదిస్తున్నారనీ, అయితే ప్రస్తుతానికి రెండు
సినిమాలు మాత్రమే అంగీకరించామనీ చెప్పింది. ఆ సినిమాల వివరాలు మాత్రం
అప్పుడే వెల్లడించదలచుకోలేదని కూడా ఆమె తెలిపింది. దీనిని బట్టి చూస్తే
భర్తతో తప్ప ఇతర హీరోలతో ఈ సుందరి జతకట్టేలా లేదని అంటున్నారు. కాగా,
ముందుగా ఈ జంట గౌరంగ్ దోషీ దర్శకత్వంలో రూపొందే 'హ్యాపీ యానివెర్శరీ'
చిత్రంలో నటిస్తారని సమాచారం.   



X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)