ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నదియాకు అంత అవసరమా?

Fri, Oct 04, 2013
నదియా
నదియా
తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా 'మిర్చి', 'అత్తారింటికి దారేది' సినిమాలలో నటించిన నదియా, ఈ సినిమాలు  సూపర్ హిట్టవడంతో ఇప్పుడు మంచి డిమాండులోకి వచ్చేసింది. గ్లామరస్ అత్త, తల్లి పాత్రలకు నదియా సరిగ్గా సరిపోతుండడంతో ఆ తరహా పాత్రలకు అమ్మడిని ఎక్కువగా అడుగుతున్నారు. ఇలా డిమాండు పెరగడంతో నదియా తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట.

'మిర్చి' చిత్రానికి 20 లక్షలు తీసుకున్న ఈ అమ్మడు, 'అత్తారింటికి...'
30 వరకు తీసుకుందట. ఇప్పుడీ సినిమా పెద్ద హిట్టవడమే కాకుండా, ఆమెకు మంచి
పేరు కూడా తీసుకురావడంతో తన పారితోషికాన్ని 50 లక్షల వరకు డిమాండు
చేస్తోందట. ఒక స్టార్ హీరోయిన్ తీసుకునే స్థాయిలో ఆమె పారితోషికాన్ని డిమాండ్ చేస్తుండడంతో, దర్శక నిర్మాతలు ఆలోచనలో పడుతున్నట్టు వార్తలు
వస్తున్నాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఇంత ఫీజు ఇవ్వడం అవసరమా? అన్న
కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.  
   
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)