ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కినేనికి అపూర్వ కానుక

Thu, Oct 03, 2013
చిత్రపటంతో విష్ణు, అక్కినేని, మోహన్ బాబు
చిత్రపటంతో విష్ణు, అక్కినేని, మోహన్ బాబు
ఇటీవలే
90వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు
మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు భారీ చిత్రపటాన్ని కానుకగా సమర్పించారు. 18
అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవుతో భారీగా రూపొందిన ఈ చిత్ర పటంలో అక్కినేని
నట జీవితానికి సంబంధించిన పలు విశేషాలు వున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే,
అక్కినేని సినిమాల పేపర్ కటింగ్సు కలగలిపి తయారుచేసిన ఈ చిత్ర పటాన్ని దూరం
నుంచి చూస్తే, శ్రీమహా విష్ణువు, శ్రీరామచంద్రుడు కనిపిస్తారు. దీనిని
కాళహస్తికి చెందిన రమేష్ గురజాల అనే చిత్రకారుడు రూపొందించాడు. ఈ ఉదయం
ఆక్కినేని ఇంటికి వెళ్లి దీనిని బహూకరించారు. 

ఈ సందర్భంగా
అక్కినేని మాట్లాడుతూ, "ఈ చిత్రపటం గురించి మోహన్ బాబు నాకు ఇటీవలే
చెప్పాడు. నా సినిమాలన్నింటినీ ఒక వరుసలో చేర్చి విష్ణుమూర్తి, శ్రీరాముడు
కనిపించేలా దీనిని చిత్రకారుడు రమేష్ అత్యద్భుతంగా చిత్రించారు. వారికి
అభినందనలు. అలాగే, మోహన్ బాబుకీ, వారబ్బాయి విష్ణుకీ కృతజ్ఞతలు
తెలుపుకుంటున్నాను" అన్నారు.   

ఎన్టీఆర్, ఏఎన్నార్ తనకు
రెండు కళ్ళనీ, వారిద్దరితో పలు చిత్రాలలో నటించాననీ మోహన్ బాబు అన్నారు. ఈ
చిత్రపటం చూడగానే తనకి కళ్ళు  చెమర్చాయని ఆయన చెప్పారు. నాగేశ్వరరావు గారి
జన్మదినం సందర్భంగా ఏదైనా విశిష్ట కానుక ఇవ్వాలని ఆలోచించి, ఆరు నెలల
క్రితం ఈ చిత్రపటం కార్యక్రమాన్ని ప్రారంభించామని విష్ణు చెప్పాడు.     


 
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)