ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'దూసుకెళ్తా'కు సెన్సార్ దెబ్బ

Wed, Oct 02, 2013
'దూసుకెళ్తా'లో విష్ణు
'దూసుకెళ్తా'లో విష్ణు
మంచు
విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మించిన 'దూసుకెళ్తా' చిత్రానికి సెన్సార్
సమస్య ఎదురైంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల సెన్సార్ కు పంపగా, అందులో
ఒకచోట 'దొబ్బేయ్...' అనే పదం వున్న కారణంగా, దీనికి U సర్టిఫికేట్
ఇవ్వడానికి సెన్సార్ అధికారి ధనలక్ష్మి తిరస్కరించారట. గతంలో ధనలక్ష్మి
సెన్సార్ చేసిన పలు చిత్రాలలో ఈ 'దొబ్బేయ్' అనే పదం విరివిగా ఉపయోగించారని,
అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు తమ సినిమాకే ఎందుకు వచ్చిందని విష్ణు ప్రశ్నిస్తున్నాడు.

దీనిపై
తమకు సెన్సార్ అధికారి నుంచి సరైన సమాధానం లభించలేదని ఆయన అంటున్నాడు.
దాంతో, తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా ఒక ట్రైలర్ను రివైజింగ్ కమిటీకి
పంపడం అన్నది తమ 'దూసుకెళ్తా' చిత్రం విషయంలోనే జరిగిందని విష్ణు
చెబుతున్నాడు. గతంలో మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' సినిమా విషయంలో
కూడా ధనలక్ష్మి తమను సెన్సార్ పరంగా ఇబ్బందులకు గురిచేశారని ఈ సినిమా
యూనిట్ ఆరోపిస్తోంది. 
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)