ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాధ కూతురికి కోపమొచ్చింది

Sat, Sep 14, 2013
కార్తీక
కార్తీక
కథానాయిక
కార్తీక మీడియా మీద మండిపడుతోంది. తన మీద లేనిపోని వార్తలు రాస్తున్నారని
ఆరోపిస్తోంది. ఒకప్పటి అందాలతార రాధ కూతురైన కార్తీకకు ఇంతగా ఆగ్రహం
కలగడానికి కారణం ఏమిటంటే, 'త్వరలో కార్తీక సినిమాలకు బై చెప్పేసి, తండ్రి
చేస్తున్న హోటల్ బిజినెస్ లో జాయిన్ కానుందంటూ' మీడియాలో ఇటీవల వచ్చిన
వార్తలే!

అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఈ చిన్నది
చెబుతోంది. "తెలుగులో సినిమాలు చేయనంత మాత్రాన నాకసలు సినిమాలు
లేనట్టేనా? ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా వున్నాను. కథానాయికగా నన్ను
నేను ప్రూవ్ చేసుకుని, ఇక్కడ సెటిల్ అవ్వాలని వచ్చాను. అలాంటిది మధ్యలో
వదిలేసి ఎలా వెళ్ళిపోతాను?'' అంటూ ఈ ముద్దుగుమ్మ ప్రశ్నిస్తోంది.   
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)