ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'తను వెడ్స్ మను' రీమేక్ లో మాధవన్, త్రిష

Fri, Apr 15, 2011
                ఇటీవల హిందీలో వచ్చిన 'తను వెడ్స్ మను' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి నల్లమలుపు బుజ్జి దాని రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిని తమిళంలో కూడా రీమేక్ చేస్తున్నారు. విశేషమేమిటంటే, హిందీలో హీరోగా నటించిన మాధవన్ తమిళంలో కూడా నటిస్తున్నాడు. దీనిని తాజాగా మాధవన్ కూడా కన్ఫర్మ్ చేశాడు.

              నిర్మాతలు తనను సంప్రదించిన సంగతి వాస్తవమేననీ, అయితే, తానింకా సైన్ చేయలేదనీ మాధవన్ చెప్పాడు. త్వరలోనే తను డేట్స్ ఇస్తానని చెప్పాడు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించే అవకాశం వుంది. హిందీలో కంగనా రనౌత్ చేసిన తనూజ త్రివేది పాత్రను తనకు ఆఫర్ చేశారని త్రిష కూడా చెప్పింది. అయితే, తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంది. చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ హిందీలో మంచి హిట్ అయింది!
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)