ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో సీక్వెల్ కి సన్నాహాలు

Sat, Jul 27, 2013
సీక్వెల్స్ పర్వంలో మరో హిందీ సినిమా
చేరుతోంది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా ఆమధ్య వచ్చిన 'తనూ వెడ్స్ మనూ'
సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తెలుగు (మిస్టర్ పెళ్ళికొడుకు) సహా
పలు భాషల్లో రీమేక్ కూడా అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్
నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.

చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ విషయం
గురించి చెబుతూ, ఈ సినిమా సీక్వెల్ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయనీ,
ఇందులో కూడా మాధవన్, కంగనాలే నటిస్తారనీ తెలిపారు. మరొకరితో నిర్మించే యోచన
లేదని చెప్పారు. అలాగే, ఇటీవల ధనుష్ హీరోగా తాను తీసిన 'రాంజానా'
చిత్రానికి సీక్వెల్ మాత్రం చేయనని చెప్పారు. "దీనికి సీక్వెల్ తీయడానికి
ఏమీ లేదు. కథంతా అందులోనే చెప్పేశాం" అన్నారు 
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)