ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సంపు' బాబు చిన్న పాత్రలు చేయడట!

Sat, Jul 27, 2013
సంపూర్నేశ్ బాబు
సంపూర్నేశ్ బాబు
ఇప్పుడు మన టాలీవుడ్ లోని 'బాబు'లందరిలోకి సునాయాసంగా, తాను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్న బాబు ఎవరంటే 'సంపు' బాబు (అదేనండీ ... సంపూర్నేశ్ బాబు) పేరే చెప్పేస్తారు ఎవరైనా.  'హృదయకాలేయం' సినిమా టీజర్ తో అంతలా పాప్యులరై పోయాడీ సంపు. ఈ టీజర్ లో మన సంపు ఒలికించిన బీభత్స, భయానక రసాలు మన స్టార్స్ లో ఎవరూ ఒలికించలేని 'స్థాయి'లో వుండి, అందర్నీ ఆకట్టుకునేశాయి. అందుకే, యూ ట్యూబ్ లో మన వాడి టీజర్ కి లక్షలాది హిట్స్ వచ్చి పడిపోయాయి.

దాంతో రాత్రికి రాత్రే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మన వాడు స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడీ సంపు బాబుకి వచ్చిన పాప్యులారిటీని దృష్టిలో పెట్టుకుని ఈ 'హృదయకాలేయం' చిత్రాన్ని యువ దర్శకుడు మారుతి కొనేశాడట. దీనికి ఓపెనింగులు విపరీతంగా వస్తాయన్న ఉద్దేశంతో మారుతి బ్యాచ్ ఈ సినిమా కమిట్ అయిందని టాక్ వినిపిస్తోంది. పనిలో పనిగా మన 'సంపు' బాబుకి మారుతీ తన సినిమాలో ఓ పాత్ర ఆఫర్ చేశాడనీ, అయితే అది తన 'స్థాయి'కి తక్కువ అన్న భావనతో సంపు దానిని సున్నితంగా తిరస్కరించాడనీ సమాచారం. అన్నట్టు, మన సంపు బాబు స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట!
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)