ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాయ చేస్తున్న చిన్మయి పాట

Fri, Jun 28, 2013
చిన్మయి
చిన్మయి
తమిళ
నేపథ్యం ఉన్న ప్రేమ కథతో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్
ఖాన్ తో రూపొందిస్తున్న చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'. ఈ చిత్రానికి
విశాల్-శేఖర్ ద్వయం సంగీతాన్ని అందించారు. ఇందులో తమిళ, తెలుగు సింగర్ చిన్మయి
పాడిన పాట పలువురిని ఆకట్టుకుంటోంది. 'తితిలీ...' పదంతో మొదలయ్యే ఈ పాట
చాలా స్వీట్ గా, వినసొంపుగా ఉండటంతో ప్రతిచోటా ఈ పాటనే వింటున్నారు.
షారుక్, దీపికా పదుకొనేపై దీనిని దర్శకుడు రోహిత్ చాలా అందంగా
తెరకెక్కించాడు.

పాటలో విజువల్స్ కు, చిన్మయి పాడిన విధానానికి సరిపోవడంతో
సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఇంతకుముందు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో
పాడిన చిన్నయి, తన హస్కీ గొంతుతో సమంతాకు డబ్బింగ్ చెబుతూ కూడా ఆకర్షించింది. ఈసారి అందుకు భిన్నంగా
గొంతును సవరించుకుని మెలోడీ పాటను అంతే మెలోడీతో పాడింది. దీనిపై షారుక్
మాట్లాడుతూ..  ఈ పాట తనకు ఫేవరెట్ గా మారిందని అంటుంటే, ప్రతిరోజు ఈ
పాటతోనే తన రోజును మొదలుపెడుతున్నానని దీపికా చెబుతోంది. ఆగస్టు 8న 'చెన్నై
ఎక్స్ ప్రెస్' విడుదలవుతోంది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)