ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూర్వాశ్రమానికి వచ్చిన ఓంకార్

Thu, Jun 27, 2013
ఓంకార్
ఓంకార్
బుల్లి
తెరపై పలు పాప్యులర్ షోలు నిర్వహించి, ఎంతోమందిని ఆకట్టుకున్న యాంకర్
ఓంకార్ ఆమధ్య దర్శకుడిగా అవతారమెత్తిన సంగతి మనకు తెలిసిందే. టీవీలోలానే
సినిమాలో కూడా తనదైన ముద్ర వేయాలనుకున్నాడు. అయితే ఆయన ప్లాన్ కాస్తా
రివర్స్ అయింది. ఓంకార్ దర్శకత్వం వహించిన 'జీనియస్' సినిమా అపజయం
పాలైంది. దాంతో ఇప్పుడు మళ్ళీ తన పూర్వాశ్రమానికి వచ్చేశాడు.

'100%
లక్' పేరుతో ఓ గేమ్ షోను
నిర్వహించబోతున్నాడు. త్వరలో మా టీవీలో ప్రసారంకానున్న ఈ కార్యక్రమంతో తన
సత్తా మరోసారి చూపుతాడట. మొదట చిన్న పిల్లలతో 'ఆట' డాన్స్ షో నిర్వహించిన
ఓంకార్, అనంతరం దానికి వరస సీక్వెల్స్ చేసి బుల్లితెరపై ఓ విప్లవం
సృష్టించాడనే చెప్పచ్చు. అదే సమయంలో 'మాయద్వీపం', 'అదృష్టం', 'ఛాలెంజ్',
'సరిగమపా'
వంటి విజయవంతమైన కార్యక్రమాలతో టీవీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. 
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)