ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, May 23, 2013
జెనీలియా
జెనీలియా
*  పెళ్లయినా కూడా తన అందం ఏమాత్రం
తగ్గలేదని చెబుతోంది అందాల జెనీలియా. తన అందం ఒరిజినాలిటీ అటువంటిదని
అంటోంది. మళ్ళీ సినిమాలలో నటించడానికి ఈ చిన్నది ప్లాన్ చేసుకుంటోంది.
అందులో భాగంగానే ఇలా తన అందంపై గొప్పలు చెబుతోందని అంటున్నారు. మరి,
ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా ఈ అందాన్ని? 
*  సిద్ధార్థ్, హన్సిక
జంటగా నటించిన 'సంథింగ్ సంథింగ్' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఖుష్బూ
భర్త సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్వరలో సెన్సార్ కు
పంపుతున్నారు. జూన్ మొదటి వారంలో దీనిని విడుదల చేస్తారు.
*  తాను
'బాహుబలి' సినిమాలో నటిస్తున్నట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని
దర్శకుడు రాజమౌళి ఖండించారు. తనకలాంటి ఉద్దేశం లేదనీ, పైగా తాను మీసాలు
పెంచానన్నది కూడా వాస్తవం కాదనీ ఆయన అంటున్నారు. మీడియాలో వస్తున్న తన ఫోటో
మూడేళ్ళ క్రితం నాటిదని రాజమౌళి చెప్పారు.
*  నాని ద్విపాత్రాభినయం
చేస్తున్న 'జెండాపై కపిరాజు' చిత్రానికి సంబంధించిన యాక్షన్ దృశ్యాలను
ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్రల్లో
నటించే స్టయిల్ అందరికీ నచ్చుతుందని దర్శకుడు సముద్రఖని చెప్పారు. అమలాపాల్
కథానాయికగా నటిస్తోంది.
*  మంచు మనోజ్, ప్రణీత శుభాష్ లపై ఇటలీలో
చిత్రీకరిస్తున్న పాట చిత్రీకరణ ముగిసింది. మోహన్ బాబు నటిస్తున్న మల్టీ
స్టారర్ సినిమా కోసం ఈ పాట షూట్ జరిగింది. విష్ణు, మనోజ్ నిర్మిస్తున్న ఈ
చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)