ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డబ్బులూ...డబ్బింగులూ...హీరోయిన్లూ!

Sun, Apr 03, 2011
                ఇప్పుడు మన టాలీవుడ్ లోని హీరోయిన్లంతా రెండే రెండు అంశాల మీద దృష్టి పెడుతున్నారు. అవేమిటంటే... డబ్బు... డబ్బింగ్! ఒకళ్లని మించి మరొకళ్లు తమ రేటుని పెంచుకుంటూపోతున్నారు. అలాగే, ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించిన డబ్బింగ్ మీద కొత్తగా దృష్టిపెడుతున్నారు. ఇంతకుముందు డబ్బింగ్ చెప్పాలంటే, భాష సమస్య ఒకటైతే, అది ఒట్టి దండగమారి వ్యవహారంగా భావించే వారు. దాని వల్ల ఆయాసం తప్పితే అదనంగా చేకూరేదేమీ ఉండదని అనుకునేవారు.

             అయితే, ఇప్పుడు ఒకళ్లని చూసి మరొకళ్లు డబ్బింగు మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. మొన్న 'గోలీమార్' లో ప్రియమణి డబ్బింగ్ చెప్పింది. తాజాగా తమన్నా '100 % లవ్' లో చెప్పింది. అలాగే, తాప్సీ కూడా 'మిస్టర్ పెర్ఫెక్ట్' లో చెప్పింది. దాంతో కాజల్ వంటి హీరోయిన్లు కూడా ఇప్పుడు డబ్బింగ్ పనిపట్టేలా కనిపిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)