ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ వస్తానంటూ ఊరిస్తున్న జెనీలియా

Tue, Apr 16, 2013
జెనీలియా
జెనీలియా
త్వరలోనే మళ్ళీ
వచ్చేస్తున్నా...  అంటూ ఊరిస్తోంది ముంబయ్ భామ జెనీలియా. గత సంవత్సరం
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని, వైవాహిక జీవితాన్ని
ఆస్వాదిస్తున్న ఈ సుందరి, సినిమాలను తాను వదిలేయలేదని చెబుతోంది. "మా ఆయన
నాకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. నా మీద ఎటువంటి ఆంక్షలు లేవు. కావాలనే
సంవత్సరం పాటు నటనకు విరామం ఇచ్చాను. మళ్ళీ తెరమీదకు త్వరలోనే వస్తాను.
ఇప్పుడు అదే పనిలో వున్నాను. కథలు వింటున్నాను. మంచి కథ దొరకగానే మళ్ళీ
ముఖానికి రంగేసుకుంటాను" అంటోంది జెన్నీ. ఓ ప్రైవేటు కార్యక్రమంలో
పాల్గొనడానికి ఈ ముద్దుగుమ్మ నిన్న హైదరాబాదుకు వచ్చింది. ఈ సందర్భంగా
మీడియాతో ముచ్చటిస్తూ, డ్రెస్సింగ్ విషయంలో సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత
ఇస్తానని చెప్పింది. డ్రెస్ ఎంత అందంగా ఉందన్న దాని కన్నా ఎంత కంఫర్ట్ గా
ఉందన్న దానికే మొగ్గు చూపుతానని చెబుతోంది జెన్నీ.               
                   
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)