ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఈగ' నేర్పిన గుణపాఠం

Mon, Mar 18, 2013
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా
నిర్లక్ష్యానికి గురవుతోందని మనవాళ్లు గగ్గోలు పెట్టని సంవత్సరమంటూ లేదు.
ఎందుకంటే, మన సినిమాలు జాతీయ అవార్డులకెప్పడూ బహుదూరమే. హిందీ, తమిళ,
బెంగాలీ సినిమాలు ప్రతి ఏటా అవార్డులు కొల్లగొడుతుంటే మనం మాత్రం అవార్డుల
ప్రకటనకు ముందే, మనకెలాగూ రాదులే అని తీర్మానించుకుంటున్నాం. ఎప్పటిలాగే
మాటల తూటాలకు పదునుపెడుతున్నాం.

అయితే, ప్రతి ఏటా జరుగుతున్న ఈ తంతుకు ఈసారి
ఫుల్ స్టాప్ పెట్టింది రాజమౌళి సినిమా 'ఈగ'. ఉత్తమ గ్రాఫిక్స్ అవార్డుతోపాటు, ఉత్తమ
ప్రాంతీయ చిత్రం అవార్డుని సైతం దక్కించుకొని, జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా
సత్తా చాటింది. కథ పాతదే అయినా సినిమాను నడిపించే కట్టుదిట్టమైన దర్శకత్వం
ఈ సినిమాను అందలమెక్కించింది. దీంతో తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల్లో
చిన్నచూపు అన్నవాళ్ల నోళ్లకు తాళాలు పడ్డాయి. వాణిజ్య విలువల కోసం మూస
చిత్రాలను తీసి జనాల మీదకు వదిలే విధానానికి అలవాటుపడ్డ మనవాళ్లు ఈ
సంఘటనతోనైనా నిజం తెలుసుకొని, గొప్ప చిత్రాలను తెరకెక్కిస్తారేమో చూద్దాం!.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)