ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్కకు విమలా రామన్ పోటీ!

Wed, Dec 01, 2010
             కధానాయిక  అనుష్కను చూడగానే  ఆ ఏభై కేజీల బంగారాన్ని సృష్టిన్చిన బ్రహ్మదేవుడికి థాంక్స్ చెప్పని కుర్రాడుండడు.  ఆ అందానికి, ఆ పర్సనాలిటీకి జోహారు చెప్పని వాళ్ళుండరు. ఆ ముగ్ధ మనోహర రూపం అటువంటిది మరి!

              ఈ మధ్య కాలంలో అంతటి పొడగరి (ఐదడుగుల తొమ్మిది అంగుళాలు) అయిన కధానాయికను మనం చూడలేదు. అందుకే, అనుష్క పది మందిలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటుంది. అందర్నీ డామినేట్  కూడా చేసి పారేస్తుంది.   చంద్రుడి ముందు చుక్కలెన్ని ఉన్నా దిగదుడుపే అన్న చందంగా అనుష్క ఫిగర్ మిల మిలా మెరుస్తుంది. 

              ఇప్పుడీ అందానికి టాలీవుడ్లో మరో అందం తోడయ్యింది.  తనే విమలా రామన్! అనుష్క అంతటి పొడగరి కాకపోయినా అందంలోనూ, ఒంపు సొంపుల్లోనూ, పోలికల్లోనూ ఆమెకు దీటుగా నిలబడుతోంది. కొన్ని యాంగిల్స్ లో  ఒక్కోసారి అనుష్కలా అనిపిస్తుంది కూడా.

             ఈ పోలికే ఇప్పుడామెకు తెలుగులో మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది. త్వరలో విడుదలయ్యే 'రంగ ది దొంగ' చిత్రం తనకు మంచి బ్రేక్ నిస్తుందని ఆసలు పెట్టుకొంది విమల. ఆల్ ది బెస్ట్ చెబుదామా!      
X

Feedback Form

Your IP address: 23.20.100.200
Movie News (Latest)