రావణుడికి బ్రహ్మదేవుని శాపం

రావణుడి కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అనేక వరాలను ఇచ్చాడు. అలాంటి బ్రహ్మదేవుని కుమార్తె అయిన పుంజికస్థల పట్ల రావణుడు తప్పుగా ప్రవర్తిస్తాడు. రావణుడి కారణంగా తనకి జరిగిన అవమానాన్ని గురించి ఆమె బ్రహ్మదేవుడికి చెబుతుంది. దాంతో ఆగ్రహించిన బ్రహ్మదేవుడు, పరస్త్రీని ఆమె అంగీకారం లేకుండా తాకినట్టయితే అతని శిరస్సు ముక్కలవుతుందని శపిస్తాడు.

రావణుడు ఎన్ని విధాలుగా బ్రహ్మదేవుడిని ప్రాధేయపడినా, తన వాక్కు ఫలించి తీరుతుందని చెబుతాడు. ఈ కారణంగానే ..  సీతాదేవిని అపహరించినప్పటికీ రావణుడు ఆమె సమీపంలోకి కూడా వెళ్లలేకపోతాడు. బ్రహ్మదేవుడు రావణుడికి ఇచ్చిన శాపం, సీతాదేవికి వరంగా మారుతుంది. ఇలా నారదుడు .. వశిష్ఠుడు .. నందికేశ్వరుడు రావణుడికి ఇచ్చిన శాపాలు, ఆయన బారి నుంచి సీతమ్మ తల్లిని రక్షిస్తూ వచ్చాయి.


More Bhakti News