సుబ్రహ్మణ్యస్వామి వెలసిన మహిమాన్విత క్షేత్రం

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలలో 'నడిపూడి' ఒకటిగా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పరిథిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. గర్భాలయంలో వల్లీ - దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తుంటాడు. సర్పరూపంలో స్వామివారు వెలిస్తే .. ఆ వెనుకనే మూల మూర్తులను ప్రతిష్ఠించారు.

గర్భాలయ ద్వారం లోపలి పై భాగంలో పుట్ట ఉండటం విచిత్రం. గర్భాలయం లోపల ఏర్పాటు చేసిన అద్దంలో, బయట నుంచున్న భక్తులు ఈ పుట్టను దర్శించుకోవచ్చు. ఈ పుట్టలోకి ఒక సర్పం వచ్చి వెళుతూ ఉంటుందని అర్చక స్వాములు చెబుతుంటారు. ఇలా గర్భాలయంలో స్వామివారు మూర్తి రూపంలోను .. సర్పరూపంలోను .. పుట్టగాను దర్శనమిస్తూ ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన సర్పదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.  


More Bhakti News