కష్టాల నుంచి గట్టెక్కించే వేంకటేశ్వర వ్రతం

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడిగా భక్త జనులచే పూజించబడుతున్నాడు. ఇలవేల్పుగా .. ఇష్ట దైవంగా ఆరాధించబడుతున్నాడు. భక్తుల కష్టాలు వినగానే కరుణతో కరిగిపోయి .. ఆ గండాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. అందువల్లనే భక్తజన కోటి ఆ స్వామిని 'గోవిందా' అని ఆర్తితో పిలుస్తుంటారు. ఆ స్వామిని దర్శించుకుని ఆనంద బాష్పాలను అర్పిస్తుంటారు.

జీవితమన్నాక కష్టనష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అనారోగ్యాలు .. ఆపదలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాంటివాటి నుంచి బయటపడాలంటే 'శ్రీ వేంకటేశ్వర వ్రతం' చేసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నియమ నిష్ఠలను పాటిస్తూ .. భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వర వ్రతం జరుపుకోవడం వలన, పాపలు నశిస్తాయి .. దోషాలు తొలగిపోతాయి. వ్యాధులు .. బాధలు దూరమవుతాయి. తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండగా పూర్తవుతాయి. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయి. అందువలన కష్టాల నుంచి గట్టెక్కాలనుకునేవారు, వ్రత కల్పం చెప్పిన ప్రకారం శ్రీ వేంకటేశ్వర వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది.   


More Bhakti News