లక్ష్మీ సరస్వతుల ఆరాధనా ఫలితం

జీవితంలో విద్య - సంపద ప్రధానమైన పాత్రలను పోషిస్తాయి. ఘనమైన సంపదలు కలిగినవారి పట్ల సరస్వతీదేవి అనుగ్రహం ఉండకపోవచ్చునుగానీ, విద్యావంతులైనవారిని లక్ష్మీదేవి తప్పకుండా కటాక్షిస్తుంది. ఇందుకు ఎన్నో సంఘటనలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎవరికైనా విద్య అవసరమే. విద్యవలన విజ్ఞానం కలుగుతుంది .. విజ్ఞానం వలన గౌరవం పెరుగుతుంది. అలాంటి విద్య .. విజ్ఞానం లభించాలంటే అందుకు హయగ్రీవస్వామి అనుగ్రహం .. సరస్వతీదేవి కరుణ ఉండాలి.

అనునిత్యం హయగ్రీవ స్వామి స్తోత్రం .. సరస్వతీదేవి ద్వాదశ నామాలు పఠించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. విద్యావంతులపట్ల లక్ష్మీదేవి చల్లని చూపు సహజంగానే ఉంటూ ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుకునేవారు, ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అంతేకాదు తలపెట్టిన కార్యాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు .. ఆటంకాలు తొలగిపోతాయి. అందువలన అనునిత్యం లక్ష్మీదేవి - సరస్వతీదేవిలను ఆరాధించడం మరువకూడదు. 


More Bhakti News